TPT: నాయుడుపేట పట్టణ నూతన ఎస్ఐగా శివశంకర్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన బదిలీపై డక్కిలి నుంచి వచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం బాధ్యతలు చేపట్టారు. పట్టణంలో శాంతిభద్రతలు, నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.