BDK: నెల 25న నిర్వహించనున్న తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.వీరన్న పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ కోసం గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను సమీకరించాలని, ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కవిత నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.