KDP: మాజీ సీఎం జగన్కు వేద ఆశీర్వచనం అందించిన ముగ్గురు అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒంటిమిట్ట, బోయినపల్లి ఆలయాలకు చెందిన అర్చకులు ఆయన నివాసానికి వెళ్లి శేషవస్త్రం, తలంబ్రాలు సమర్పించారు. ఈ చర్యను టీటీడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.