సత్యసాయి: తనకల్లు మండలం రెడ్డివారిపల్లి తండాలో ఏళ్ల తరబడి నెలకొన్న తాగునీటి సమస్యను కదిరి MLA కందికుంట వెంకటప్రసాద్ పరిష్కరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గ్రామంలో నూతనంగా బోరు వేయించగా, నీరు సమృద్ధిగా పడింది. వెంటనే మోటార్, పైపులు బిగించి నీటి సరఫరా పునరుద్ధరించారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.