AP: బెజవాడ దుర్గమ్మను దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు. గతంలో మొక్కు ఉండగా.. తాజాగా కానుకలు సమర్పించి, మొక్కు తీర్చుకున్నట్లు దువ్వాడ వివరించారు. అయితే ఏ దేవాలయానికి వెళ్లినా తమ జంటపై ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.