శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 24న జరిగే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షా కేంద్రం చిరునామాపై జిల్లా విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సెంటర్ కోడ్ 0121-బాల భాను విద్యాలయం అనేది శ్రీకాకుళం కృష్ణ పార్క్ దగ్గర ఉందని, షేర్ మహమ్మద్ పురం (ఎస్.ఎం.పురం) ఏపీఆర్ఎస్ ప్రిన్సిపల్ ఎ. శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పి.ఎన్. కాలనీ అని ఉంటే నమ్మరాదన్నారు.