రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో రానున్న ‘తలైవార్ 173’ డైరెక్టర్‌పై సస్పెన్స్ వీడింది. మొదట దర్శకుడు సిబి చక్రవర్తి ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ స్థానంలో అశ్వత్ మరిముత్తు పేరు వినిపించినా, చివరికి సిబి చెప్పిన కథకే రజినీ ఓకే చెప్పారట. ‘జైలర్ 2’ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇందులో రజినీ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని టాక్.