అన్నమయ్య: మదనపల్లిలో పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి 300 ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 10 బైక్లు, 3 ఆటోలు సీజ్ చేశారు. డ్రోన్ నిఘా మధ్య ఆపరేషన్ కొనసాగింది. డీఎస్పీ పావని పర్యవేక్షణలో 11 బృందాలు, 125 మంది సిబ్బంది పాల్గొన్నారు. పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, అపరిచితులపై సమాచారం ఇవ్వాలని సూచించారు.