SRPT: అనంతగిరి మండలం కొత్త గోల్ తండ గ్రామ సర్పంచ్ బానోవేణు నాయక్ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల గ్రామ పెద్దలు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.