TG: రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. తమ 32 డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు సమ్మెలో భాగంగా డ్రైవర్లు, కండక్టర్లు విధులు బహిష్కరించి డిపోల ముందు బైఠాయించారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తగ్గేదే లేదని అంటున్నారు. ఇవాళ కేబినెట్లో తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.