TG: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. విధుల్లోకి రావాలని ఆర్టీసీ కార్మికులను ఎండీ బెదిరిస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులతో ఈవీ వెహికల్స్ నడిపించాలన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ పరం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు.