GNTR: వేసవి కాలంలో పిల్లలు ఈత కోసం లేదా సరదాగా కృష్ణానది, కాలువలు, చెరువుల వద్దకు వెళ్తుంటారని, ఆ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమని ఎస్పీ హెచ్చరించారు. లోతు నీటి ప్రవాహం అంచనా వేయలేక పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను అటువంటి ప్రదేశాలకు ఒంటరిగా పంపకూడదని అన్నారు. నదీ తీరాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.