AP: పిఠాపురంలో ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఈ ఘటనలో మాజీ MLA వర్మ తీరును సీఎం తప్పుపట్టారు. ప్రొటోకాల్, ప్లెక్సీలపై ఫొటోల పేరుతో ఘర్షణపడటం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తేవాలని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పల్లాకు సూచించారు.