NDL: పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దాతలు రూ.50,116 విరాళం ఇవాళ అందించారు. ఈవో రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన నాగశేఖర్, జయలక్ష్మి ఈ విరాళాన్ని సమర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.