KDP: పేదల ఆకలి తీర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. సోమవారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పులివెందులలోని స్థానిక అన్న క్యాంటీన్లో వేడుకలను నిర్వహించారు. కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ఇంఛార్జ్ అన్న క్యాంటీన్లో పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.