NZB: భీమగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో విజ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు గ్రామ యువత, ప్రజలు శ్రీకారం చుట్టారు. సోమవారం జడ్పీ హైస్కూల్ పక్కన నూతన గ్రంథాలయ నిర్మాణ పనులకు ఘనంగా భూమిపూజ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు, విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్థులు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.