అన్నమయ్య: పరశురామ స్వామి దేవాలయం కడప జిల్లా రాజంపేట సమీపంలోని అత్తిరాల గ్రామంలో ఉన్న ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం పరశురామ స్వామికి అంకితమైన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అందమైన 72 స్తంభాల మండపం ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెయ్యేరు నది తీరంలోని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పాప విమోచనం కలిగి శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.