TPT: తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 22న సాయంత్రం పుష్పయాగం అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 23న స్నపన తిరుమంజనం, పుష్పాభిషేకం నిర్వహించి, సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.1,000 చెల్లించి పాల్గొనవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.