TG: కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. రేవంత్‌కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కాగా కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో భేటీకానున్నారు.