మెదక్లో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా 1వ వార్డు కౌన్సిలర్ చెప్యాల రాజవ్వ, సంజీవ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నాయకత్వంలో పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా తాజాగా రాజవ్వ చేరికతో ఆ సంఖ్య మరింత పెరిగింది. దీంతో మెదక్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి.