వైఎస్‌కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి కథ’. దర్శకుడు నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తండ్రి విలువను, తరం మధ్య ఉండే భావోద్వేగాలను చాటిచెప్పే ఈ సందేశాత్మక చిత్రం మే 1న విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో అశోక్ రెడ్డి, తోట సుబ్బారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.