ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ‘పూరి మ్యూజింగ్స్’లో ‘సైన్స్ అండ్ బిలీఫ్’ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకాన్ని నమ్మకాలతో కాకుండా శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ‘సైన్స్ మిమ్మల్ని చంద్రమండలానికి తీసుకెళితే.. నమ్మకం స్వర్గానికి తీసుకెళుతుంది’ అని తనదైన శైలిలో విశ్లేషించారు. దేనినీ గుడ్డిగా నమ్మకుండా, ప్రతి అంశాన్ని సాక్ష్యాలతోనే గ్రహించాలని హితవు పలికారు.