AP: విశాఖ జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న మోసం కలకలం రేపుతోంది. కమిషనర్ ఫొటోతో కూడిన నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించి, అత్యవసరం అంటూ డబ్బులు కోరుతూ సందేశాలు పంపుతున్నారు. ఈ విషయంపై కమిషనర్ స్పందిస్తూ.. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, ఇలాంటి మెసేజ్లకు స్పందించి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అపరిచిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.