WNP: దోస్త్ (DOST) 2026-27 అడ్మిషన్లలో భాగంగా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ప్రిన్సిపల్ బి.ఈశ్వరయ్య కోరారు. కళాశాలలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, గత ఏడాది విద్యార్థినులు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ నుంచి రూ. 3 లక్షల స్కాలర్షిప్ పొందారని తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.