అన్నమయ్య: AP ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అమలు చేస్తున్న వెలుగు సంఘమిత్రలకు మొలకలచెరువులో 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.