MBNR: మిడ్జిల్ మండలం నూతన తహసీల్దార్‌గా రాఘవేంద్ర రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన పులి రాజు పదోన్నతిపై బదిలీ కావడంతో, ఆయన స్థానంలో రాఘవేంద్ర రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.