PLD: చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్లో ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ఉండడంతో ప్రజలు స్పందిస్తున్నారు. కమిషనర్ పీ. శ్రీహరిబాబు సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది వసూళ్లు చేపడుతున్నారు. విజయ్ కృష్ణ హాస్పిటల్ రూ.1.12 లక్షలు చెల్లించింది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.