TPT: పెళ్లకూరు నుంచి నాయుడుపేట వరకు అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని MLA నెలవల విజయశ్రీ తెలిపారు. గురువారం పలుచోట్ల ఆమె అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెళ్లకూరు మండలం పాల్చూరు వద్ద సంగం డెయిరీ విస్తరణ పనులకు భూమిపూజ నిర్వహించగా, నాయుడుపేటలో బయో ఫ్యూయల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.