NLG: కొండమల్లేపల్లి మండలం కోల్ ముంతల్ పహాడ్ రైతు వేదిక వద్ద రేపు ఉదయం 9 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్య క్రమానికి రాష్ట్ర ఆర్ & బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ వర్గం తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.