కాకినాడ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు వేతనాలు పెంచాలని, వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దాపురం శాసనసభ్యులు ఇంటివద్ద నిరసన తెలిపి అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అన్నారు.