TG: భద్రాచలంలో ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గడ్డి మందు తాగాడు. దీంతో అప్రమత్తమై తోటి కార్మికులు అడ్డుకున్నారు. వెంటనే అతన్ని ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఇద్దరు కార్మికులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.