మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం సీరోలు మండలానికి చెందిన గునిగంటి వంశీ(23), జార్ఖండ్‌కు చెందిన సుధాకర్ (52)ల బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.