TG: కాళేశ్వరం తీర్పుపై BRS సంబరాలు విడ్డూరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కమిషన్ చట్టబద్ధమైనదని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. నిర్దోషులు, తప్పు చేయలేదని చెప్పలేదని స్పష్టం చేశారు. సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలో సబ్‌కమిటీ వేస్తామన్నారు. సీఎం రేవంత్, తాను సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తామని వెల్లడించారు.