NZB: రైలు కింద పడి ఓ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాధవ్ నగర్ వద్ద జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. హమాల్వాడికి చెందిన అనిల్, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య గతకొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనస్తాపానికి గురైన అనిల్ గురువారం ఉదయం డెమో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.