పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన ‘బ్లాక్ స్పాట్స్’ తాడేపల్లిగూడెం, తణుకులలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాలను ఆయన పరిశీలించారు.