HNK: బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వెహికల్ షెడ్‌ను శుక్రవారం మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. షెడ్లో జరుగుతున్న నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, పనులు సమర్థవంతంగా కొనసాగాలని అధికారులకు సూచించారు. మరమ్మతుకు వచ్చిన వాహనాలను ఆలస్యం లేకుండా వెంటనే రిపేర్ చేసి తిరిగి వినియోగంలోకి పంపాలని మేయర్ ఆదేశించారు.