NGKL: ఉప్పునుంతల మండలంలో రైతులకు సరిపడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం మండల కార్యదర్శి చింతల నాగరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ ఏడాది సాగు పెరిగినప్పటికీ, మండలంలో కేవలం ఒక్క కేంద్రమే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.