KDP: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు లేదా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని మాజీ ఎంపీ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య, విద్యకు దూరమవుతారని, రోగులకు ఉచిత వైద్యం అందదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.