WNP: చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అనితను పురిటి నొప్పులతో ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. ఈఎంటీ నరేందర్ సమయస్ఫూర్తితో ప్రసవం నిర్వహించగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో వనపర్తి మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ నరేందర్, పైలట్ రాఘవేంద్రను అధికారులు,కుటుంబ సభ్యులు అభినందించారు.
Tags :