WGL: ఎంసీపీయూ జిల్లా పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ పోగుల ఆగయ్య 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ.. అమరజీవి అసెంబ్లీ టైగర్ మద్ది కాయల ఓంకార్ అడుగుజాడల్లో నడిచిన గొప్ప నాయకుడు ఆగయ్య అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటాలు అభినందనీయమని అన్నారు.