బీకాడీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. రతన్ చదివింది 8వ తరగతి అయినా.. తన అద్భుత వ్యాపార వ్యూహాలతో బీకాడీ ఫుడ్స్‌ను రూ.13 వేల కోట్ల విలువైన కంపెనీగా మలిచారు.