కడప కలెక్టరేట్ PGRS హాల్లో బుధవారం కలెక్టర్ డా.శ్రీధర్ వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లాలో ‘సంజీవని’ కార్యక్రమం అమలు చేయడానికి ముందుగా వైద్యులకు అవగాహన కల్పిస్తామని, అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.