PDPL: గోదావరిఖని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రత్యేక టూర్ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. హంపి, గోవా, గోకర్ణ మురుడేశ్వర, ధర్మస్థల, కుక్కె సుబ్రహ్మణ్యం, మంత్రాలయం వరకు ప్రత్యేక లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామన్నారు. వారం పాటు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 6,800 నిర్ణయించామన్నారు.