మెదక్: పిల్లలను పోషించలేని ఆర్థిక ఇబ్బందులు, ఇతరకారణాలతో కొందరు తల్లిదండ్రులు కన్నబిడ్డలను నిర్దయగా పొదలు, చెత్త ప్రదేశాల్లో వదిలేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు సంక్షేమ శాఖ అప్రమత్తమై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బుధవారం న్యాల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఓ మగశిశువును వదిలి వెళ్లిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది.