అనంతపురం ఐటీఐ బాలుర కాలేజీలో ఈనెల 8న అప్రెంటిస్ మేళా, రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చదువుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి కంపెనీలు ముందస్తుగా ఆఫర్ లెటర్లు అందజేస్తాయి. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్, పాన్ కార్డుతో హాజరుకావాలని కోరారు.