WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పది రోజుల ముగింపు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ సభల్లో వర్షాకాల సన్నద్ధత, జల-మట్టి సంరక్షణ, తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి ఐదు ప్రధాన అంశాలపై చర్చ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.