పార్వతీపురం కేంద్రంలో ఉన్న మహిళ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా జేగురుపాటి షణ్ముఖేశ్వర రావు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. గతంలో షణ్ముఖేశ్వర రావు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్ఐగా విధులు నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన, మహిళలను కించపరిచిన చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని అన్నారు.