SKLM: రాగోలు జేమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న మరణాలపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అనంత సింగ్ ఆర్యని రాష్ట్ర ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు యోగి గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ కమిషన్ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. ఆదివాసీ విద్యార్థి చంద్రశేఖరుకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.