PPM: ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన బస్ షెల్టర్ల నిర్మాణ పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎస్. ప్రభాకరరెడ్డి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటిసరఫరా విభాగాల ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.