KMR: భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో పిడుగు పడి ఒకరు మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి పెద్దఎత్తున ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామ శివారులో గల డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో పిడుగు పడటంతో బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు వెల్లడించారు.